Home / Telangana / V6 Mangli Telangana Formation day song Lyrics in Telugu
telangana formation day2017 song by v6 mangli

V6 Mangli Telangana Formation day song Lyrics in Telugu

రేలారే రేలారే
నీళ్ళల్లో నిప్పల్లె ,వచ్చింది నిజమల్లే
పడి లేచి నిలిచే రణములో …నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచే రణములో

Watch : Lover Movie Fame Tulya Jyothi Full Interview

Click Here>> Mangli and Kathi Karthika’s Bathukamma Song Relare Relare << Click Here

ఓ రేలారే రేలారే
పల్లె మట్టి వాసనలు , స్వచ్ఛమైన మనుషులే
అందమైన భూమీ జగములో …నా తెలంగాణ …
బంగారు భూమి జగములో

సింగిడి రంగుల పూల ,
ఇది జానపదాల మాల
కొట్లాటను నేర్పిన నేల…..
ఓఓఓ ఓఓఓ ఓఓఓ

రేలారే రేలారే
నీళ్ళల్లో నిప్పల్లె ,వచ్చింది నిజమల్లే
పడి లేచి నిలిచే రణములో …నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచే రణములో

మిన్నులం , తడి మన్నులం ,
మేమ్ పచ్చ పచ్చ మొక్క జొన్న పంటలం

వాగులం , మేమ్ వంకలం
మా భాషే తియ్యని సీతాఫలం

వేములవాడ , యాదాద్రి
మా మొక్కుల నిలయం మేడారం

బొట్టు బోనం కలలే
మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే

పోతన పుట్టిన భూమీ
ఇది కొమురం భీముల పుడమి

సిరులు పండె మాగాణి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

తరంగులం , మేమ్ ఫిరంగులం
మేమ్ అందమైన కృష్ణ జింక పరుగులం

కాంతులం , పూ బంతులం
మేమ్ కిల కిల పాలపిట్ట పలుకులం

చెమటలం , తడి చెలుకలం
మేమ్ జమ్మి చెట్టు ఆకు పచ్చ తళుకులం

తారలం, తంగేడు పువ్వులం
మా ఖ్యాతి కాకతీయ కళా తోరణం … Check it out

Check Here For English: “Telangana Formation day by V6 Mangli Lyrics Relare

హుస్సేన్ సాగర్ , చార్మినార్
ఘన చరితకు సాక్ష్యం గోల్కొండ

సింగరేణి సిరులే
జల జీవాధార మా నదులే

చెరువుల మిల మిల మెరుపు
పక్షుల కిల కిల అరుపు
పచ్చని ప్రకృతి పిలుపు
ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ

రేలారే రేలారే
నీళ్ళల్లో నిప్పల్లె ,వచ్చింది నిజమల్లే
పడి లేచి నిలిచే రణములో …నా తెలంగాణ
లేచి నిలిచి గెలిచే రణములో

కమ్మగా ఉంటది యాస
అతి ప్రాచీనం మా భాష
బతుకమ్మే మా శ్వాస
ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

Please follow and like us:

Check Also

Lover Fame tulya

Lover Fame Baby Tulya Jyothi Full Interview| Raj tarun

Please follow and like us: