Home / Entertainment / why kattappa killed bahubali in Telugu

why kattappa killed bahubali in Telugu

కట్టప్ప బాహుబలిని చంపాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎందుకు చంపాడనే క్యూరియాసిటీనే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాపై అంచనాల్ని పెంచింది కూడా ఈ క్యూరియాసిటీనే. అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న కట్టప్పే, తన చేతులతో బాహుబలిని వెన్నుపోటు పొడవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానంతో పాటు తాజాగా ఇప్పుడు మరో ప్రశ్న కూడా ఉత్పతన్నమైంది. అసలు బాహుబలిని చంపమని కట్టప్పను ఆదేశించింది ఎవరు.. రానానే కట్టప్ప ద్వారా బాహుబలిని చంపించాడా.. లేక ఇందులో శివగామి పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న కథనం ఈ క్వశ్చన్ కు చిన్నపాటి సమాధానాన్ని అందిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలిస్తున్న శివగామి దగ్గర బాహుబలి గురించి ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతారట రానా, నాజర్ టీం. మరోవైపు దేవసేన(అనుష్క)తో కలిసి మాహిష్మతి సామ్రాజ్యంపై దండెత్తే ఆలోచనలో కూడా బాహుబలి ఉన్నట్టు పుకార్లు పుట్టిస్తారు. ఈ పుకార్లను నమ్మిన శివగామి.. రివర్స్ లో బాహుబలిపై దండయాత్ర చేయాలని ఆజ్ఞాపిస్తుంది. కుదిరితే బాహుబలిని బంధించమని, కుదరకపోతే హతమార్చమని కట్టప్పను ఆదేశిస్తుందట. శివగామి ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో బాహుబలిని చంపేస్తాడట కట్టప్ప.

 ప్రస్తుతం సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతున్న స్టోరీ ఇదే. ఇందులో నిజమెంత.. ఈ కుట్రలో భళ్లాలదేవుని పాత్ర ఎంత… అనుష్క ప్రేమను పొందడానికే రానా ఇదంతా చేస్తాడా అనే ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో సమాధానం తెలిసిపోతుంది.  బాహుబలి-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది.

Why kattappa Killed Bahubali Revealed in Bahubali 2

Please follow and like us: