Home / Bathukamma / Essay on Bathukamma in Telugu | Bathukamma Festival 2017
Essay on Bathukamma in telugu

Essay on Bathukamma in Telugu | Bathukamma Festival 2017

తెలంగాణా రాష్ట్ర ప్రజల సాంస్కృతిక ప్రతీకగా ‘బతుకమ్మ’ జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి మొదలుకుని తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. దసరా పండుగకు రెండురోజుల ముందు ఈ బతుకమ్మ జాతరను నిర్వహించుకుంటారు. ఈ పండుగ చాలావరకు సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలలో జరుపబడతాయి. అదేవిధంగా దసరా పండుగ కూడా కలిసి రావడంతో ఈ రెండు పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందులో బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణ వాళ్లకు మాత్రమే చాలా ప్రత్యేకమైంది. ఈ పండుగ శీతాకాలంలో తొలిరోజులలో రావడం వల్ల వాతావరణం పూలతో, నీటితో కొలువై వుంటుంది. అలాగే రకరకాల పండ్లు, పూలు కూడా ఈ కాలంలోనే చాలావరకు వీస్తాయి. ముఖ్యంగా ఇందులో బంతి, చేమంతి, వర్ధనం లాంటి చాలా ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ఈ రంగురంగుల పువ్వులతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ జాతరకు సంబంధించి కొన్ని పురాన కథనాలు కూడా వున్నాయి.
బతుకమ్మ పండుగ కథ :

మొదటి కథ : పూర్వం ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ ఊరి ప్రజలు ఆమెను చిరకాలం ‘బతుకమ్మ’ అనే పేరుతో దీవించారట. అప్పటి నుంచి మొదలైన ఈ జాతర నాటికీ అమలులోనే వుంది.  స్త్రీలు ఈ పండుగ సందర్భంగా తమకు ఎటువంటి ఆపదలు రాకూడదని, తమ భర్తలు – కుటుంబం చల్లగా వుండాలని గౌరవమ్మను ఎంతో దైవంగా ప్రార్థిస్తారు.

రెండవ కథ : పూర్వం దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ చక్రవర్తి ధర్మంగదుడు అనే రాజుకి సంతానం లేకపోవడంతో ఆయన అనేక పూజా కార్యక్రమాలను నిర్వహించాడు. దాంతో అతని భార్య గర్భవతి అయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక అమ్మాయి జన్మించింది. పసిబిడ్డయిన లక్ష్మీ అనేక గండాలతో గట్టెక్కింది కాబట్టి ఈమె తల్లిదండ్రులు ఆమెకు ‘బతుకమ్మ’ అనే పేరును నామకరణం చేశారు. అప్పటి నుంచి యువ వయస్సులో వున్న అమ్మాయిలు తమకు మంచి భర్త ప్రసాదించాలని కోరుతూ ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం జరిగింది.

పండుగ విధానం :

సాధారణంగా ఈ పండుగ దసరా పండుగకు రెండురోజుల ముందు వస్తుంది కాబట్టి ఆడవారు చాలా ఉత్సాహంతో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా చిన్న చిన్న బతుకమ్మలు చేసి, వాటి చుట్టూ తిరుగుతూ ఆడుకుంటారు. ఆ తరువాత దగ్గరలో వున్న నీటి జలాలలో వాటిని నిమజ్జనం చేస్తారు. అయితే చివరిరోజు మగవారంతా కూడా మనోహరంగా ఆడవారితో కలిసి తంగేడి పూలను, గునుక పూలను భారీగా తీసుకుని వస్తారు. ఆ తరువాత అందరూ కలిసి అన్ని రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.

ముందుగా తంగేడు ఆకులు, పూలను పళ్లెంలో లేదా తాంబూలంలో పేర్చుతారు. ఆపై తంగేడు పూలతో తయారుచేసిన కట్టల చివరలను కోసి, రంగులతో అద్ది వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో కొన్ని ఇతర రకాల పూలను కూడా ఉపయోగిస్తారు. ఇలా పేర్చడం పూర్తయ్యాక పైన పసుపుతో చేసిన గౌరిమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. వీటిని ఇళ్లలో దైవస్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారుచేసిన బతుకమ్మల చుట్టూ తిరిగుతూ, పాటలతో గౌరిదేవిని కీర్తిస్తూ ఆడవాళ్లు ఆడుకుంటారు.

ఇలా చాలాసేపు ఆడవాళ్లు ఆడుకున్న తరువాత ఆ బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. తిరుగు వస్తూ వారు పళ్లెంలో ఆ చెరువు నీటిని తీసుకుని, వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆపై ఇంట్లో తయారు చేసుకున్న ఆహార పదార్థాలను ఇచ్చుపుచ్చుకుంటారు. చివరిరోజు సాయంత్రం ఆడవారు అందరూ చక్కని దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమలను కలిపి రంగరిస్తూ… మానవహారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ముందు ఒకరు పాట మొదలుపెడితే.. తరువాత అందరూ వారితో గొంతు కలుపు పాడతారు. ముఖ్యంగా జానపద గీతాలు పాడుతారు.

చీకటి పడుతుంది అనగా… ఆడవాళ్లందరూ ఈ బతుకమ్మను తలపై పెట్టుకుని తమ ఊరులలో వున్న పెద్ద చెరువుల దగ్గరకు ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు కొనసాగేంతవరకు ఆడవాళ్లు జానపద గీతాలు పాడుకుంటూ వెళతారు. జలాశయానికి చేరుకున్న తరువాత బతుకమ్మను నీటిలో జారవిడుస్తారు. తరువాత ఖాళీ తాంబూలంతో ఇంటికి చేరుకుంటారు.

More Stories to read:

Please follow and like us:

Check Also

Saddula Bathukamma

Bathukamma Day 9 Saddula Bathukamma | 2017 Celebrations

The end of the Bathukamma Festival is on the Maha Navami. This day is known …