Home / India / నిన్న అకస్మాత్తుగా చనిపోయిన కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే

నిన్న అకస్మాత్తుగా చనిపోయిన కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే

నిన్న అకస్మాత్తుగా చనిపోయిన కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే అతి సామాన్య జీవితం గడిపి తనువు చాలించాడు…అతని గురించి ఏ న్యూస్ ఛానల్ వివరాలు ఇవ్వలేదు. కారణం అతడు పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాకపోవడమే…

నది అంటే పిచ్చి… నర్మద అంటే మైకం… ప్రకృతి, పర్యావరణ అంటే ప్రేమ… అసలు ఇప్పటి మురికి, చిల్లర, చెత్త, క్షుద్ర రాజకీయాల్లో ఉండలేనివాడు, నిజానికి ఉండాల్సినవాడు… కానీ ఉండలేక లోకమే వదిలి వెళ్లిపోయాడు…

తన పేరు అనిల్ మాధవ్ దవే… నిన్న మరణించిన కేంద్ర మంత్రి దవే ఎవరు..? ఎక్కడివాడు..? ఏందీ తన కెరీర్..? తన తత్వమేంటి..? అని కొన్ని విషయాల కోసం అన్వేషిస్తుంటే చాలా ఆసక్తికరం అనిపించింది…

వార్డు సభ్యుడి దగ్గర నుంచి మంత్రుల దాకా మెజారిటీ రాజకీయ నాయకుల్ని చూసి, రాజకీయాలంటే అసహ్యం పుడుతున్న స్థితిలో ఇలాంటివాళ్ల గురించి చదువుతుంటే ‘హాయిగా’ అనిపించింది…

కమర్షియల్ పైలట్ లైసెన్సు ఉన్న నాయకుడు.చిన్న cessna ఎయిర్‌క్రాఫ్ట్‌లో నర్మద నదీ పరీవాహక ప్రాంతమంతా ఆకాశమార్గాన తిరిగి, మొత్తం పరిస్థితిపై తనే స్వయంగా ఓ అంచనాకు వచ్చాడు… అదీ తన ప్యాషన్

రచయిత, పాటలు రాస్తాడు, పుస్తకాలు రాస్తాడు… తన రిపోర్టులు తనే రాసుకుంటాడు.పర్యావరణవేత్త.నదులంటే ప్రాణం.తన ఇంటిపేరు కూడా నదీ కా ఘర్, తన ఆర్గనైజేషన్ పేరు నర్మద సమగ్ర… నదుల్ని, పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మానవ జీవితం మరింత ఘోరంగా మారుతుందంటాడు…

తన జీవితంలో అధికశాతం నర్మద పరీవాహకం గురించే తపనపడ్డాడు… ఓ చిన్న తెప్పలో కూర్చుని 19 రోజుల పాటు నర్మద మొత్తం నదంతా కవర్ చేశాడు… ప్రతి ఆసక్తికరాంశాన్ని రికార్డు చేశాడు…

2004లో ఏకంగా 25 వేల స్వచ్ఛంద సంస్థలను ఒక్క గొడుగు కిందకు తీసుకొచ్చి జనఅభియాన్ పరిషత్ స్టార్ట్ చేశాడు… దీని నేతృత్వంలోనే నర్మద సేవాయాత్ర నిర్వహించారు…

శివాజీ అంటే అభిమానం… జనతారాజ అని ఓ శివాజీ పాత్ర ఆధారిత నాటకం విస్తృత ప్రదర్శనలు ఇప్పించేవాడు…

ఫ్లయింగ్, షూటింగ్ అంటే ఆసక్తి తనకు… సొంతంగా ఓ రివాల్వర్, ఓ పిస్టల్ కొన్నాడు…
మొదట్లో జేపీ అంటే అభిమానించిన తను తరువాత ఆర్ఎస్ఎస్‌లో చేరి, ప్రచారక్‌గా పనిచేస్తూ, బ్రహ్మచర్యమే దీక్షగా బతుకంతా అలాగే ఉండిపోయాడు…

మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ స్ట్రాటజిస్టుల టీంలో దవే కీలకపాత్ర పోషించాడు… తరువాత 2009లో రాజ్యసభ సభ్యుడు, మొన్న 2016లోనూ మళ్లీ పార్టీ ఛాన్స్ ఇచ్చింది…

ఉజ్జయిని సింహాస్త సందర్భంగా, వైచారిక్ మహాకుంభ్ అనే ఓ సదస్సు నిర్వహించాడు… ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు, మన కర్తవ్యం అనేది ఆ చర్చాంశం…

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏమాత్రం అవకాశం వచ్చినా సరే, అనిల్ మాధవ్ దవేను సీఎంను చేయాలని పార్టీ భావించింది… మరో యోగీ అయ్యేవాడేమో…

ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్‌కు దవే పర్యావరణానికి సంబంధించి చేస్తున్న కార్యక్రమాలంటే ఇష్టం, అదే తనను కేంద్రమంత్రిని చేసింది…

ఇవన్నీ ఒక ఎత్తు… మరి వ్యక్తిగతంగా…?

నిరాడంబరం… నిజాయితీ… నిబద్ధత… సంపాదన మాత్రమే పరమావధిగా, పెత్తనం చెలాయించడం మాత్రమే తెలిసిన చిల్లర రాజకీయ నాయకులను రోజూ పత్రికల్లో మన చుట్టూ ఎందరినో చూస్తున్నాం… కనీసం వ్యక్తిగత సంస్కారం కూడా ఉండదు చాలామందిలో… అలాంటిది పెళ్లిచేసుకోకుండా, ఏమీ సంపాదించుకోకుండా, పర్యావరణం కోసం, ప్రకృతి కోసం, నదుల కోసం, మనిషి మనుగడ కోసమే తపించిన నాయకులు దవే…

బీజేపీ, ఆర్ఎస్ఎస్… వాటిల్లో వర్క్… అవి తన జీవితంలో ఓ భాగం… కానీ తను పర్యావరణం గురించి, ప్రత్యేకించి నర్మద నది గురించి చేసిన కార్యక్రమాలే ఎక్కువ…
చివరకు తన అంత్యక్రియలు కూడా నర్మదతీరంలోనే చేయాలని కోరుకున్నాడు… ఆ నదిలోనే ఐక్యమైపోయాడు…

చివరగా… తన పేరిట స్మారక అవార్డులు, కార్యక్రమాలు వద్దనీ, నిరాడంబరంగా, వైదిక సంప్రదాయంలో అంత్యక్రియలు జరిగితే చాలునన్నాడు.

ఎవరో పిలిచినట్టుగా హడావుడిగా వెళ్లిపోయాడు… అన్యాయం కదా దవేజీ…!!

About Nava telangana

Check Also

paytm pre GST sale

Huge discounts on Cars, ACs & Phones in Pre GST sale

Driving brands and retailers have been putting forth huge rebates to offer old stock before …