Home / Entertainment / బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో `అమ‌రావ‌తి`

బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో `అమ‌రావ‌తి`

ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి కొన్ని స‌ల‌హాలూ సూచ‌న‌లు ఇస్తున్నాడు మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను. మ‌హాన‌గ‌రంగా అమ‌రావ‌తిలో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్టాలి? అనే విష‌యంపై ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే ఓ అవ‌గాహ‌న ఉంది. అయితే ప‌ర్యాట‌క న‌గ‌రంగా ఎలా ప్ర‌మోట్ చేయాలి?? అనే విష‌యంపై చంద్ర‌బాబు నాయుడు కొంత‌మంది ప్ర‌ముఖుల స‌ల‌హాల్ని తీసుకొంటున్నారు. అందులో భాగంగా బుధ‌వారం అమరావ‌తిలో చంద్ర‌బాబు – బోయ‌పాటిల మ‌ధ్య 15 నిమిషాల భేటీ సాగింది. ఈ సంద‌ర్భంగా బోయ‌పాటి పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ కూడా చేసిన‌ట్టు స‌మాచారం. ఇది వ‌ర‌కు ఇలాంటి స‌ల‌హాలూ సూచ‌న‌ల‌కు కె.రాఘ‌వేంద్ర‌రావుని సంప్ర‌దించే చంద్ర‌బాబు.. ఇప్పుడు న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌పై దృష్టి పెట్ట‌డం గ‌మ‌నించ‌ద‌గిన విష‌యం. గోదావ‌రి పుష్క‌రాల‌కూ.. బోయ‌పాటి స‌ల‌హాల‌నే పాటించారు చంద్ర‌బాబు. అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణంలోనూ ఇప్పుడు బోయ‌పాటికే పిలుపు వెళ్లింది

బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో `అమ‌రావ‌తి`

About Nava telangana

Check Also

Ramya krishna latest look

Ramya Krishna Latestlook on JFW magazine cover page

Bahubali lo shivagamiga natinchi prapanchanni shake chesina senior nati Ramya Krishna. Glamour Roles, Devotional roleslo …